AP: నెల్లూరు నగరాన్ని 2028 జూన్ 12 నాటికి గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే ఏడాది జూన్ 12లోపు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పనులను పూర్తి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో చివరి దశలో 10 శాతం పనులు పూర్తికాక నిధులు వెనక్కి వెళ్లాయని, ప్రస్తుతం మళ్లీ నిధులు సమీకరించి పనులు చేపడుతున్నామని తెలిపారు. నెల్లూరును దోమలు లేని నగరంగా మార్చడమే లక్ష్యమన్నారు. నవాబుపేటలో 21.3 ఎకరాల్లో రూ.60 కోట్లతో పీపీపీ విధానంలో కమర్షియల్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.