ప్రభుత్వం మీద తప్పుడు విమర్శలు చేస్తే ఊరుకోం: అచ్చెన్నాయుడు

AP: వైసీపీపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. రూ. 3000 పెన్షన్ రూ. 4000 చేశామని తెలిపారు. అన్న క్యాంటీన్లు పెట్టామని, మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. రానున్న రోజుల్లో ముందే అకౌంట్‌లో డబ్బులు వేసేస్తామని స్పష్టం చేశారు. తల్లికి వందనం విషయంలో ప్రతిపక్షం నిద్రపోతున్నట్టు నటిస్తున్నారని విమర్శించారు. నారా లోకేష్ చాలెంజ్ చేస్తే ఉలుకు పలుకు లేకుండా ఉన్నారని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్