ఏపీలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో 13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని, ఇప్పటివరకు 8.80 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీని ద్వారా 24 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని సీఎం పేర్కొన్నారు.