2026లో రెట్టింపు సంతోషం, అభివృద్ధి అందిస్తాం: చంద్రబాబు

AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025లో కూటమి ప్రభుత్వం పాలనలో అనేక మైలురాళ్లను అధిగమించిందని, సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు ఆ ఏడాది నాంది పలికిందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. 2026 నూతన సంవత్సరం అందరి జీవితాలలో కొత్త కాంతులు నింపాలని, ప్రజలకు రెట్టింపు సంతోషం, సంక్షేమం, అభివృద్ధి అందించేందుకు కృషి చేస్తానని ఆయన మాటిచ్చారు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2026 అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్