AP: రాష్ట్రంలో ఘన వ్యర్థాల నిర్వహణకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ప్రతి రోజు సుమారు 6,500 టన్నుల ఘన వ్యర్థాలు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పూర్తిగా స్థాపితమైతే, దేశవ్యాప్తంగా వ్యర్థాల నిర్వహణలో ఏపీ ముందంజలో నిలుస్తుందన్నారు. విజయవాడ, నెల్లూరు, కాకినాడ, కర్నూలు, కడపల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.