త్వరలోనే రైతులకు రూ.20 వేలు ఇస్తాం: మంత్రి నారాయణ

AP: రైతులకు కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి మొత్తం రూ.20 వేలు ఇస్తామని మంత్రి నారాయణ అన్నారు. మంగళవారం ప.గో జిల్లా తాడేపల్లిగూడెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని తేల్చి చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తల్లికి వందనం పథకం ద్వారా రూ.10 వేల కోట్లు తల్లుల ఖాతాలో జమ చేశామన్నారు.

సంబంధిత పోస్ట్