త్వరలో విజయవాడలో 24వేల ఇళ్ల పట్టాలు అందిస్తాం: మంత్రి లోకేశ్

AP: మంగళగిరిలో మంత్రి నారాలోకేశ్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయినప్పుడు తాను కుంగిపోలేదని అన్నారు. మరోసారి ఇక్కడే గెలవాలనే పట్టుదలతో ముందుకెళ్లానని తెలిపారు. పట్టాల సమస్యను పరిష్కరిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చానని, ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టుదలతో పనిచేస్తున్నామని చెప్పారు. త్వరలో విజయవాడలో 24 వేల ఇళ్ల పట్టాలు అందిస్తామని వెల్లడించారు. మంగళగిరిలో త్వరలో 100 పడకల ఆస్పత్రిని పూర్తి చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕