క్రైస్తవులకు అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు

AP: విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్‌లో నేడు సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రైస్తవులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. 'గుంటూరులో క్రైస్తవ భవనం పూర్తి చేస్తాం. ఐదేళ్లుగా వైసీపీ దీని గురించి పట్టించుకోలేదు. జెరూసలేం వెళ్లే క్రైస్తవులకు ఆర్థిక సహాయం మేమే ప్రారంభించాం. క్రైస్తవ స్మశాన వాటికల నిర్మాణానికి కృషి చేస్తాం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్