AP: తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో బుధవారం సీఎం చంద్రబాబు 'రైతన్నా మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు, రైతు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని, రైతుల సమస్యలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని తెలిపారు. రైతన్నకు అండగా ఉండటమే తమ మొదటి నినాదమని స్పష్టం చేసిన సీఎం, నీటి వనరులు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.