AP: జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కీలక ప్రకటన చేశారు. జనసేన వీర మహిళలకు తాము తోబుట్టువుల్లా అండగా ఉంటామని విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో వెల్లడించారు. మహిళలను అనాదిగా నాలుగు గోడలకే పరిమితం చేశారని, రాజకీయ, సామాజిక అంశాల్లో మహిళా శక్తి చాలా కీలకంగా మారనుందని నాగబాబు పేర్కొన్నారు. వీర మహిళల సమస్యలు, అభిప్రాయాలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు.