ఏపీకి మరో 7 రోజుల పాటు వాతావరణ హెచ్చరికలు

ఏపీలో రాబోయే ఏడు రోజుల పాటు వాతావరణ శాఖ భారీ వర్ష సూచనలు చేసింది. కోస్తాంధ్ర మరియు యానాం ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ అధికారులు వెల్లడించారు. తీరప్రాంతంలో గంటకు 110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాయలసీమలో రానున్న నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕