ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నేతలు, మంగళవారం పోడూరులో టెక్నికల్ అసిస్టెంట్ టి. బాబురావును కలిసి ఉపాధిహామీ శ్రామికుల వేతన బకాయిలు విడుదల చేయాలని కోరారు. దీనిపై బాబురావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రూ.1,668 కోట్లు విడుదల చేసిందని, మూడు, నాలుగు రోజుల్లో శ్రామికుల బ్యాంకు ఖాతాల్లో వేతన బకాయిలు జమ అవుతాయని తెలిపారు. మే 15 తర్వాత చెల్లించాల్సిన వేతనాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు లేఖలు రాసిందని, ప్రస్తుత నిధులతో ఆగస్టు 15 వరకు బకాయిలు తీరిపోతాయని ఆయన పేర్కొన్నారు.