పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ పట్టణంలో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వీధుల్లో, రోడ్లపై గుంపులుగా తిరుగుతూ దారిన పోయేవారిపై, ద్విచక్ర వాహనదారులపై దాడులకు పాల్పడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కుక్కల నిర్మూలన చర్యలు చేపట్టి, ప్రజలకు, విద్యార్థులకు రక్షణ కల్పించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.