విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. భీమవరం నుంచి 46 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వస్తున్న బస్సు టైర్ పేలడంతో అదుపు తప్పి, రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.