ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువేస్తున్న మాకు ఉద్యోగరీత్యా పలు సమస్యలతో ఒత్తిడికి గురవుతున్నామని, సమస్యలను పరిష్కారించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్డు వెల్ఫేర్ కార్యదర్శుల సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ హనీ ప్రవీణ్ కోరారు. భీమవరం ఎమ్మెల్యే పులవర్తి అంజిబాబును శుక్రవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసారు. అనంతరం సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు.