బహిరంగ మార్కెట్లో నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణకు వర్తకులు సహకారం అందించాలని ప. గో. జిల్లా జేసీ ప్రవీణ్ ఆదిత్య కోరారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో సంబంధిత అధికారులు, రిటైల్ అమ్మకందారులతో సమావేశమై బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధర స్థిరీకరణపై సమీక్షించారు. రైతుబజార్లు, రిలయన్స్, డిమార్ట్, సూపర్ మార్కెట్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేయాలని ఆదేశించారు.