పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం జరిగిన వాసవి క్లబ్ రీజియన్ మీట్ లో నరసాపురం వాసవి క్లబ్ కు 12 అవార్డులు లభించాయి. రీజియన్ ఛైర్మెన్ వాసుదేవ గుప్తా, ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మామిడి శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రీజియన్ లోని 16 క్లబ్ ల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నరసాపురం క్లబ్ సభ్యులు అవార్డులు అందుకున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.