కొప్పర్రు జిల్లా పరిషత్ స్కూల్ ఉపాధ్యాయుల వీడ్కోలు సభ

నరసాపురం మండలం కొప్పర్రు జిల్లా పరిషత్ హైస్కూల్ లో టీచర్ గా పనిచేసి, గురువారం రిటైర్మెంట్ అవుతున్న శ్రీ గూడూరి సత్యనారాయణకి వీడ్కోలు సభ జరిగింది. ఈ సందర్బంగా సత్యనారాయణ పిల్లల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకునేవారని వక్తలు కొనియాడారు. ఈ సభలో శ్రీ సీతారామ స్వామి దేవస్థానం చైర్మన్ పోలిశెట్టి గణేశ్వరరావు, హెచ్ఎం సంకు తాతయ్య, సహోపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్