బంగారం దొంగ అరెస్ట్

నరసాపురం టౌన్ పోలీసులు మంగళవారం మద్యం మత్తులో ఉన్న వ్యక్తి వద్ద బంగారం దొంగిలించిన పాలెపు దుర్గాప్రసాద్ (23) అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ. 1.70 లక్షల విలువైన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఆకుల రఘు తెలిపారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురానికి చెందిన దుర్గాప్రసాద్, నరసాపురం చర్చిపేటలో అనుమానస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్