విజయవాడలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న న్యాయవాదులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, మహిళా న్యాయవాదులపై అనుచితంగా ప్రవర్తించడంపై జాతీయ కాపు సంక్షేమ సంఘం చైర్మన్ కొత్తపల్లి రమేష్ నాయుడు గురువారం తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవాదుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, ఆంధ్రప్రదేశ్‌లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.