నరసాపురం మండలం వేములదీవి వెస్ట్ గ్రామంలో శనివారం, ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా పాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 'సేవా సంకల్ప అభయాన్' కార్యక్రమం నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా, సర్దకోడప తుఫాను బిల్డింగ్లో సంచార చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తూర్పు తాళ్ళ వైద్యాధికారి డాక్టర్ అనిల్ కిరణ్, వైద్య సిబ్బంది వై. టి. మూర్తి, రవి కిరణ్, ఇందిర, ప్రేమలత, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, డీఈవో స్వామి, ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.