నరసాపురం మండలం వేములదీవి గ్రామములో వేంచేసియున్న శ్రీ భూ సమేత వైభవ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం సందర్భంగా అర్చకులు అరుణ్ కుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో సుప్రభాత సేవ అనంతరం భక్తులచే ప్రత్యేక పూజలు జరిగినవి. అలంకరణ అనంతరం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు భక్తులు సౌజన్యంతో అఖండ అన్న సమారాధన కలదని కమిటీ సభ్యులు తెలిపారు.