పేకాట ఆడుతున్న ముగ్గురి అరెస్టు

నరసాపురంలో మంగళవారం పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కంబాల వారి వీధి శివారులో జరిగిన ఈ దాడిలో జూదం ఆడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.28,120 నగదు, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్