పాలకొల్లు మండలం చింతలగరువు స్కూల్లో బుధవారం ఎస్బీఐ వ్యవస్థాపక దినోత్సవాన్ని హెచ్ఎం కొల్లాబత్తుల సూర్య కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా, 1955 జూలై 1న భారత ప్రభుత్వం 'ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా'ను జాతీయం చేసి, 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా'గా మార్చి ప్రజలకు విస్తృత సేవలు అందిస్తోందని కుమార్ తెలిపారు. ఎస్బీఐ ద్విశతాబ్ధి ఉత్సవాలలో భాగంగా విడుదల చేసిన రూ.5 నాణేలను ఆయన పాఠశాలలో ప్రదర్శించారు.