తణుకు పట్టణంలో గురువారం ఉదయం నుంచి వర్షం కురుస్తుంది. గత కొద్దిరోజులుగా ఎండ వేడిమి ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో సైతం 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉష్ణతాపంతో అల్లాడిపోతున్నారు. అయితే గురువారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో వాతావరణం కాస్త చల్లబడింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.