పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం NRP అగ్రహారం శివారు చెరువుగట్టుపాలెంలో శుక్రవారం ఒక కొండచిలువ రహదారి దాటుతున్న దృశ్యం కలకలం రేపింది. పాలకేంద్రం సమీపంలో జాతీయ రహదారి 165కి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిని చూసిన వాహనచోదకులు భయపడ్డారు. ఈ ప్రాంతంలో ఇలాంటిది చూడటం ఇదే తొలిసారి అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.