మహాదేవపట్నంలో అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఘనంగా నిర్వహణ

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహాదేవపట్నం శివారు ఉప్పరగూడెం స్కూల్లో సోమవారం అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు నారాయణరెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో MEO లక్ష్మీనారాయణ, నరసరాజు, డాక్టర్ రంగరాజు, HM రవివర్మలు శాంతి ప్రాముఖ్యతను వివరించారు. తొలుత శాంతి ప్రతిజ్ఞ చేసి, అనంతరం పురవీధుల్లో మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో హరనాధరాజు, వేంకటరామరాజు, నరసింగరావు, అనంతలక్ష్మీ, రంగప్రసాదరాజు, టీచర్ సుమలత, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕