ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. తహసీల్దార్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలలో ఉండాలని, చెట్లు వద్ద ఉండరాదని, పిడుగులు పడే అవకాశం ఉందని ఉండి తహసీల్దార్ మంతెన రామప్రసాద్ బుధవారం తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండి, అందుబాటులో ఉండాలని, ఉండి తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో ఉండి మండలంలో వర్షాలు అధికంగా కురుస్తున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕