కాళ్ళ మండలం జక్కరం 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల నిమిత్తం శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు జక్కరం, బొండాడ, బొండాడపేట, కోపల్లె, ఎల్ఎన్ పురం, సీసలి, వాండ్రం గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్. వెంకటేశ్వరరావు గురువారం తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.