పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా పాందువ్వ హైస్కూల్లో బీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రాజెక్ట్ వీర గాధ 6.0 చిత్రలేఖనం పోటీలు బుధవారం నిర్వహించారు. మండల బీజేపీ ఉపాధ్యక్షులు చింతాడ మహేష్ ఈ విషయాన్ని తెలిపారు. హైస్కూల్ హెచ్ఎం గెడ్డం అబ్రహం డ్రాయింగ్ పోటీలు నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.