పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గంలో 2,15,270 మంది ఓటర్లకు గాను 35,622 మందికి వివిధ కారణాల వల్ల నోటీసులు ఇచ్చినట్లు జిల్లా పంచాయితీ అధికారి వై. దోసిరెడ్డి తెలిపారు. ఈ విషయంపై బుధవారం ఉండి తహసీల్దార్ కార్యాలయంలో ఆయన వివిధ అధికారులతో, రాజకీయ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో MRO రామ్ ప్రసాద్ రాజు, MDO శ్రీనివాస్, ఎలక్షన్ డిటి రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.