కాళ్లకూరు శ్రీస్వామి వారి దేవస్థానం కోసం స్థలం కొనుగోలు నిమిత్తం దాతలు రూ. 2.20 లక్షలు విరాళంగా అందించినట్లు చైర్మన్ అడ్డాల నాగరాజు శుక్రవారం తెలిపారు. బైరవపట్టణంకు చెందిన గాదిరాజు కుటుంబం రూ. 1.10 లక్షలు, తాడినాడకు చెందిన నారాయణరాజు కుటుంబం రూ. 1.10 లక్షలు అందజేశారు. ఈ విరాళాలు దేవస్థానం స్థల కొనుగోలుకు ఉపయోగపడతాయి.