ఆచంట నియోజకవర్గంలో 80% పైగా సర్పంచ్ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని మాజీ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు వ్యాఖ్యానించారు. పెనుగొండ మండలం సిద్ధాంతం శివారు గుడిపాడు సత్తెమ్మ తల్లి ఆలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుడిపాడు సత్తెమ్మ తల్లి సాక్షిగా ఈ విషయాన్ని చెబుతున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.