కొడమంచిలిలోని చిలుకూరి జానకి భూలక్ష్మి సూర్యకాంతం జడ్పీ ఉన్నత పాఠశాలలో 1984-85 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. దశాబ్దాల తర్వాత కలుసుకున్న మిత్రులు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సరదాగా గడిపారు. సహపంక్తి భోజనాలు చేసిన వారు, భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. ఈ సమ్మేళనం మిత్రుల మధ్య అనుబంధాన్ని బలపరిచింది.