ఆచంట మండలం ఆచంట వేమవరం సమీపంలోని పంట కాలువలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మతిస్థిమితం లేని వ్యక్తి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెంది ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటరమణ తెలిపారు.