ఆచంట: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

ఆచంట మండలంలో జిల్లా పరిషత్ నిధుల ద్వారా రూ. 33.5 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ పనులలో ఆచంటలో కైలాసధామంకు వెళ్లే రహదారి, పోరలో కల్వర్టు నిర్మాణం, కరుగోరుమిల్లి గ్రామంలో ముత్యాల వారి పాలెం, వల్లూరు గ్రామంలో నీరుల్లిపాలెం, మట్టపర్తివారిపాలెంలలో సిసి రహదారుల నిర్మాణం వంటివి ఉన్నాయి.

సంబంధిత పోస్ట్