రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ శుక్రవారం ఆచంటలో నిర్వహించిన మహా రుద్రయాగానికి హాజరయ్యారు. వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రచయిత ఎం.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి రచించిన "తుమ్మెదా ఓ తుమ్మెదా" కథల పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తక పఠనం విజ్ఞానాన్ని పెంపొందిస్తుందని, ఒత్తిడిని తగ్గిస్తుందని తెలిపారు. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు.