వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర అనుబంధ నియామక కమిటీలలో పశ్చిమగోదావరి జిల్లా యువతకు అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా ఆచంట నియోజకవర్గంలోని మార్టేరు గ్రామానికి చెందిన మండ విశ్వనాథ నారాయణ రెడ్డిని స్టేట్ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా నియమించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. నియామకంతో ఆచంట వైసీపీ శ్రేణులు నారాయణ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.