పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం గ్రామంలో అంగన్వాడీ సెంటర్ లో సీడిపీఓ కృష్ణ కుమారి ఆధ్వర్యంలో శుక్రవారం తల్లిపాల వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. పిల్లలకు తల్లిపాలే అన్నిటికన్నా మిన్న అని, అవి రోగ నిరోధక శక్తిని అందిస్తాయని సీడిపీఓ వివరించారు. కార్యక్రమంలో సూపర్ వైజర్ వరలక్ష్మి, ఎంఎల్ హెచ్ పీ కుమారి, అంగన్వాడీ టీచర్ శాంతకుమారి, ఆశ సిబ్బంది, ఆయా, బాలింతలు, గర్భిణీలు, తల్లులు పాల్గొన్నారు