ఒక ప్రక్క వర్షాలు రాక మరోవైపు సాగునీరు అందక నారుమళ్లు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. పెనుగొండ మండలం నడిపూడి, చినమల్లం గ్రామాల్లో సాగునీరు అందక వ్యవసాయ పనులు మొదలవ్వలేదని సిపిఎం పార్టీ పెనుగొండ మండల కార్యదర్శి ఎస్ కే పాదుషా అన్నారు. గురువారం చినమల్లం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కెనాల్ నుండి సాగునీరు సరిగా అందడం లేదని పెనుగొండ తహసీల్దార్ జి అనిత కుమారికి ఫోన్ చేసి సమస్యను తెలియజేసినట్లు చెప్పారు.