తణుకు నియోజకవర్గంలోని పెనుగొండ-కంతేరు రోడ్డులో కాకిలేరు వద్ద రాపాక కాలువపై ఉన్న వంతెనకు ఇరువైపులా రక్షణ గోడలు కూలిపోయి 8 ఏళ్లు గడుస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఇరగవరం, పెనుమంట్ర, తణుకు ప్రాంతాల ప్రజలు ఈ వంతెనపై నిత్యం ప్రయాణిస్తున్నారు. రాత్రి సమయంలో వీధిదీపాలు లేక ప్రమాదం పెరిగిపోతోందని వాహనదారులు వాపోతున్నారు.