ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన జుత్తిగ నాగరాజును అత్తిలి ఏఎంసీ ఛైర్మన్, అత్తిలి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు దాసం ప్రసాద్ అభినందించారు. ఆదివారం ఉండి నియోజకవర్గంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని, పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని దాసం ప్రసాద్ ఆకాంక్షించారు.