జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో యశోద హాస్పిటల్లో శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం పెనుగొండ గ్రామంలో భక్తి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ రోజు సాయంత్రం 4:30కు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధి వరకు పాదయాత్ర జరుగుతుంది. అనంతరం ప్రత్యేక అర్చనలు ఉంటాయి. జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.