రైతులకు రాజముద్ర పాస్‌పుస్తకాలు పంపిణీ

ఆచంట మండలం పెనుగొండ గ్రామపంచాయతీ పరిధిలో రైతుల భూ హక్కులకు భరోసా కల్పించే దిశగా కీలక కార్యక్రమం జరిగింది. స్థానిక సర్పంచ్ నక్క శ్యామల సోనీ శాస్త్రి అధ్యక్షతన, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ రైతులకు రాజముద్రలతో కూడిన కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీతో పాటు గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, భూమిపై రైతుకు పూర్తి హక్కు కల్పించడమే ఈ కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ లక్ష్యమని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్