పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువు గ్రామంలో శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థులకు పరిసరాల పరిశుభ్రతపై ఏఎన్ఎం లక్ష్మీ, ఆశా సిబ్బంది అవగాహన కల్పించారు. ఇళ్ల వద్ద చెత్త, పాడైన వస్తువులు ఉంచరాదని, వీటివల్ల దోమలు అధికమై విషజ్వరాలు వ్యాప్తి చెందుతాయని వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.