ఆచంటలో గ్యాస్ సిలిండర్ పేలుడు, పెను ప్రమాదం తప్పింది

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కరుగోరిమిల్లి గ్రామంలో రాత్రి 9 గంటల సమయంలో వంట గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పింది. సిలిండర్ పేలడంతో దాని భాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడటంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు, కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. వేసవికాలం దృష్ట్యా గ్యాస్ సిలిండర్ల వాడకంలో గృహిణులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక సిబ్బంది సూచించారు.

సంబంధిత పోస్ట్