అత్తిలి మండలంలోని మంచిలి గ్రామంలో మంగళవారం టీడీపీ స్థానిక నేత శిరగాని నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 'సుపరిపాలన తొలి అడుగు' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరిమిల్లి రాధకృష్ణ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి, వారి అభిప్రాయాలను సేకరించారు. కార్యక్రమంలో బూత్ ఇంచార్జ్‌లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.