పెనుగొండ పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం 4గంటల నుంచి భారీ వర్షం కురిసింది. ఇదే సమయంలో స్కూల్స్ వదిలే సమయం కావడంతో విద్యార్థిని విద్యార్థులు తమ ఇళ్లకు చేరుకునేందుకు ఇబ్బందికి గురయ్యారు. పలువురు వ్యాపారస్తులు, వాహనాదారులు వర్షానికి ఇబ్బంది ఎదుర్కోన్నారు. వరి నాట్లకు ఈ వర్షం రైతులకు మేలు చేస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.