కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామంలో జరిగిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వలవల రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో నున్న సుబ్రహ్మణ్యం, శ్రీను పాల్గొన్నారు.