మార్టేరులో కిసాన్ మేళా: వరి సాగుపై రైతులకు అవగాహన

ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మార్టేరు, మరియు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త నిర్వహణలో ఏప్రిల్ 8వ తేదీన మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానం ఆవరణలో కిసాన్ మేళా నిర్వహించనున్నట్లు ఏడిఆర్ డాక్టర్ టి.శ్రీనివాస్ తెలిపారు. ఈ మేళాలో మారుతున్న వాతావరణ, వాణిజ్య పరిస్థితులు, సుస్థిర వరి వ్యవసాయంపై శాస్త్రవేత్తలు రైతులతో క్షేత్ర సందర్శన, వ్యవసాయ ప్రదర్శన, చర్చా గోష్టి, రైతు సదస్సు, వ్యవసాయ ప్రచురణల విడుదల వంటి కార్యక్రమాలు ఉంటాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్